Posts

Showing posts from April, 2022

REAL AI ......పదవ భాగం

REAL AI పదవ భాగం రచయిత : అడ్లూరి మునిందర్ రాజు హైదరాబాద్. తెల్లవారుజామున ఏడు గంటలు. నగరం మేల్కొంటోంది. ఇళ్ళలో వెలుతురు వస్తోంది. రోడ్లపై వాహనాల రద్దీ నెమ్మదిగా పెరుగుతోంది. పూల అమ్మకందారులు తమ బుట్టలు సర్దుకుంటున్నారు. పాతబస్తీ సందుల నుండి వేడివేడి ఇడ్లీల వాసన వస్తోంది. అన్నీ సాధారణంగానే ఉన్నాయి. కానీ ఒక పరిశోధనా కేంద్రం (రీసెర్చ్ లాబ్)లో మాత్రం... అన్విత నేల మీద కూర్చుని ఉంది. చేతుల్లో ముఖం దాచుకుంది. ఒళ్ళు వణుకుతోంది. చెమట ఇంకా ఆరలేదు. శ్వాస వేగంగా, ఆందోళనగా వస్తోంది. సిద్ధార్థ్ రెండు అడుగుల దూరంలో నిలబడ్డాడు. ఆమె "నా దగ్గరకు రావొద్దు" అని అరిచింది. కింద కూర్చుండి పోయింది. అతను ముందుకు వెళ్ళలేదు, అలాగని వెనక్కీ వెళ్ళలేదు. అతని మనసులో వేయి ప్రశ్నలు. తెరపై కనిపించిన ఆ రూపం... ఆమె "నాన్నా" అని అరిచింది. ఆమె తండ్రి పదిహేను సంవత్సరాల కిందటే మరణించారు. మరి ఆ ముఖం ఆమె తండ్రిదా? లేక... "శరీరంలో ఒత్తిడి స్థాయిలు ప్రమాదకరంగా ఉన్నాయి. రక్తంలో హార్మోన్ల మార్పులు గమనించాను. తక్షణమే జోక్యం చేసుకోవడానికి అనుమతి కోరుతున్నాను." నోవా హెచ్చరించింది. అన్విత తల పైకెత్తింది. ...

మానసిక ఒత్తిడిని జయించడం ఎలా?

ఈ రోజుల్లో క్షణం తీరిక లేని, వృత్తి పరమైన అంశాల్లో మనం ఒత్తిడిని ఎదుర్కొంటూ ఇతరులు కూడా ఒత్తిడిని ఎదుర్కోవడం చూస్తున్నాం.   ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు మనం గురయ్యే ఒత్తిడిని అందరూ share చేసుకునే వారు. కాసేపు అందరితో గడిపితే ఆ ఒత్తిడి తగ్గేది. కానీ ఉదయం లేచిన్నుండి..ఆ రాత్రి పడుకునే అవకాశం వస్తుందో రాదో తెలియనంత ఒత్తిడి.. ఉద్యోగ పరంగా కాని, ఫ్యామిలీ విషయాల వల్ల గానీ ప్రతీది ఒత్తిడికి గురి చేస్తుంది.  అయితే ఒత్తిడి అనగానే దాన్ని అందరూ negative దోరణిలో ఊహించుకుంటారు. కానీ అందులో పాజిటివ్ waves ఉన్న విషయం కూడా గుర్తించలేని పనుల్లో బిజీగా ఉంటున్నాము పని ఒత్తిడి లో మనం మనసారా నవ్వడం లేదు...నవ్వే సందర్భాలు వచ్చినా మనం నవ్వకుండా బలవంతంగా ఎదుటి వాళ్ళ కోసం అన్నట్టు ఓ వంకర చిరునవ్వుతో దాన్ని ముగిస్తాం.  చిన్నపాటి నడకకు గానీ, వ్యాయామం చేయడం గానీ మనకు సమయం ఉండదు...అని అనుకుంటాం గానీ మనం బద్దకస్తులం అన్న విషయం మనకు తెలియదు.ఎవరన్నా చెప్పినా మనం ఒప్పుకోము.  మనకు దొరికిన సమయంలో మనకు 6 గంటలు నిద్రపోయే ఓపిక ఉండదు. ఆ సమయంలో మనం ఎంతసేపూ గతం లో జరిగి పోయిన అనవసరమైన సందర్భాలను గుర్తు తెచ్...