Posts

Showing posts from 2022

విద్యలో కృత్రిమ మేధస్సు

విద్యలో కృత్రిమ మేధస్సు: భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి A Muninder Raju కృత్రిమ మేధస్సు (Artificial Intelligence - AI) మన జీవితంలోని ప్రతి రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది. విద్యారంగం కూడా దీనికి మినహాయింపు కాదు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు... అందరూ ఈ శక్తివంతమైన సాంకేతికత ప్రభావానికి లోనవుతున్నారు. AI కేవలం ఒక టెక్నాలజీ మాత్రమే కాదు, అభ్యాస ప్రక్రియను మరింత సమర్థవంతంగా, వ్యక్తిగతంగా మరియు అందుబాటులోకి తీసుకురాగల ఒక శక్తివంతమైన సాధనం. ఈ కథనంలో, విద్యలో AI ఎలా సహాయపడుతుందో, దాని ప్రయోజనాలు, సవాళ్లు మరియు భవిష్యత్తును విశ్లేషిద్దాం. విద్యార్థులకు కృత్రిమ మేధస్సు ప్రయోజనాలు AI విద్యార్థుల అభ్యాస అనుభవాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది. ప్రతి విద్యార్థి యొక్క ప్రత్యేక అవసరాలను తీర్చడంలో ఇది సహాయపడుతుంది. వ్యక్తిగతీకరించిన అభ్యాసం (Personalized Learning) AI ప్రతి విద్యార్థి యొక్క అభ్యాస శైలి, వేగం మరియు బలాలను అర్థం చేసుకొని, వారికి తగిన పాఠ్య ప్రణాళికలను రూపొందిస్తుంది. ఉదాహరణకు, ఒక విద్యార్థి గణితంలో ఒక నిర్దిష్ట భావనను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడితే, AI ఆ ర...

ఒక గణిత ప్రేమికుని భావుకత ...ఈ (గణిత ) కవిత

  ఇన్నాళ్లు sin 90 డిగ్రీలా  నా జీవితంలో ఒక్కణ్ణే అనుకున్నా … cosec 30 విలువలా మనం కలిసి వెళ్తుంటే అందరి చూపులూ మనపైనే …. నువ్వు నన్ను అడిగావు గుర్తుందా …. ఏం చూసి నాకు 143 చెప్పావని.... తాజ్ మహల్ చూడగానే ఎంత స్వాంతన పొందుతామో ఆ నిర్మాణంలో ఉన్న గోల్డెన్ రేషియో నీ ముఖార విందం లో చూసాను నేను. ... స్థూపంలా చుట్టిన చాప వైశాల్యం కనుక్కోవటానికి వ్యాసార్థం కోసం ... నేను బేలగా వెంపర్లాడుతున్నప్పుడు ... నీవు అలవోకగా చాపను నేలపై పరిచి  పొడవు వెడల్పులతో వైశాల్యం కనుక్కుని చెప్పిన నీ తెలివికి అబ్బుర పడిపోయా. .. ఒక బిందువు నుండి బయలు దేరి కిరణం లా ముందుకు వెల్దామనుకున్నా . .. కానీ నిన్ను చేరగానే నీతో కలిసి రేఖాఖండంలా కలిసి ఉందామని ఆగిపోయా… వృత్తానికి స్పర్శరేఖలా నువు నన్ను ఎప్పుడూ అంటిపెట్టుకుని ఉండు కానీ ఛేదన రేఖలా మారి నా మనసును ఎప్పుడూ అర్ధ వృత్త ఖండాలుగా మార్చొద్దు  జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ పై విలువలా  స్థిరంగా ఉండాలి .. తప్ప లవ హారాల్లో నువ్వా నేనా అంటూ విలువలు పెంచుకుని మన నిష్పత్తిని మార్చుకోవద్దు..  శూన్యకోణం లో కలిసిన మన మనసులు అవసరాన్ని బట్టి లం...

మానసిక ఒత్తిడిని జయించడం ఎలా?

ఈ రోజుల్లో క్షణం తీరిక లేని, వృత్తి పరమైన అంశాల్లో మనం ఒత్తిడిని ఎదుర్కొంటూ ఇతరులు కూడా ఒత్తిడిని ఎదుర్కోవడం చూస్తున్నాం.   ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు మనం గురయ్యే ఒత్తిడిని అందరూ share చేసుకునే వారు. కాసేపు అందరితో గడిపితే ఆ ఒత్తిడి తగ్గేది. కానీ ఉదయం లేచిన్నుండి..ఆ రాత్రి పడుకునే అవకాశం వస్తుందో రాదో తెలియనంత ఒత్తిడి.. ఉద్యోగ పరంగా కాని, ఫ్యామిలీ విషయాల వల్ల గానీ ప్రతీది ఒత్తిడికి గురి చేస్తుంది.  అయితే ఒత్తిడి అనగానే దాన్ని అందరూ negative దోరణిలో ఊహించుకుంటారు. కానీ అందులో పాజిటివ్ waves ఉన్న విషయం కూడా గుర్తించలేని పనుల్లో బిజీగా ఉంటున్నాము పని ఒత్తిడి లో మనం మనసారా నవ్వడం లేదు...నవ్వే సందర్భాలు వచ్చినా మనం నవ్వకుండా బలవంతంగా ఎదుటి వాళ్ళ కోసం అన్నట్టు ఓ వంకర చిరునవ్వుతో దాన్ని ముగిస్తాం.  చిన్నపాటి నడకకు గానీ, వ్యాయామం చేయడం గానీ మనకు సమయం ఉండదు...అని అనుకుంటాం గానీ మనం బద్దకస్తులం అన్న విషయం మనకు తెలియదు.ఎవరన్నా చెప్పినా మనం ఒప్పుకోము.  మనకు దొరికిన సమయంలో మనకు 6 గంటలు నిద్రపోయే ఓపిక ఉండదు. ఆ సమయంలో మనం ఎంతసేపూ గతం లో జరిగి పోయిన అనవసరమైన సందర్భాలను గుర్తు తెచ్...