Posts

Showing posts from 2025

REAL AI ......పదవ భాగం

REAL AI పదవ భాగం రచయిత : అడ్లూరి మునిందర్ రాజు హైదరాబాద్. తెల్లవారుజామున ఏడు గంటలు. నగరం మేల్కొంటోంది. ఇళ్ళలో వెలుతురు వస్తోంది. రోడ్లపై వాహనాల రద్దీ నెమ్మదిగా పెరుగుతోంది. పూల అమ్మకందారులు తమ బుట్టలు సర్దుకుంటున్నారు. పాతబస్తీ సందుల నుండి వేడివేడి ఇడ్లీల వాసన వస్తోంది. అన్నీ సాధారణంగానే ఉన్నాయి. కానీ ఒక పరిశోధనా కేంద్రం (రీసెర్చ్ లాబ్)లో మాత్రం... అన్విత నేల మీద కూర్చుని ఉంది. చేతుల్లో ముఖం దాచుకుంది. ఒళ్ళు వణుకుతోంది. చెమట ఇంకా ఆరలేదు. శ్వాస వేగంగా, ఆందోళనగా వస్తోంది. సిద్ధార్థ్ రెండు అడుగుల దూరంలో నిలబడ్డాడు. ఆమె "నా దగ్గరకు రావొద్దు" అని అరిచింది. కింద కూర్చుండి పోయింది. అతను ముందుకు వెళ్ళలేదు, అలాగని వెనక్కీ వెళ్ళలేదు. అతని మనసులో వేయి ప్రశ్నలు. తెరపై కనిపించిన ఆ రూపం... ఆమె "నాన్నా" అని అరిచింది. ఆమె తండ్రి పదిహేను సంవత్సరాల కిందటే మరణించారు. మరి ఆ ముఖం ఆమె తండ్రిదా? లేక... "శరీరంలో ఒత్తిడి స్థాయిలు ప్రమాదకరంగా ఉన్నాయి. రక్తంలో హార్మోన్ల మార్పులు గమనించాను. తక్షణమే జోక్యం చేసుకోవడానికి అనుమతి కోరుతున్నాను." నోవా హెచ్చరించింది. అన్విత తల పైకెత్తింది. ...

ఆత్మ విశ్వాసమే విద్యార్థి జీవితానికి పునాది

Image
   ఒకప్పుడు సోనాపూర్  అనే చిన్న గ్రామంలో కిరణ్ అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు, కానీ ఆ యువకునికి  ఆత్మవిశ్వాసం తరచుగా లోపించేది. పెద్ద కలలు కనేవాడు, కానీ వాటిని సాధించగలనా అని ఎప్పుడూ సందేహించేవాడు. ఒక రోజు, గ్రామానికి ఒక వృద్ధ సాధువు వచ్చాడు. అతని జ్ఞానం మరియు స్ఫూర్తిదాయకమైన మాటలకు పేరు గాంచిన అతను, గ్రామస్తులందరినీ ఆకట్టుకున్నాడు. కిరణ్ కూడా సాధువు వద్దకు వెళ్లి తన సమస్యను వివరించాడు. "నాకు పెద్ద కలలు ఉన్నాయి, కానీ వాటిని సాధించగలననే నమ్మకం లేదు" అన్నాడు కిరణ్. సాధువు చిరునవ్వు నవ్వి, "నీ ఆత్మవిశ్వాసం అనేది నీలోపల ఉన్న ఒక నిధి లాంటిది, కిరణ్. దాన్ని వెలికితీయాలి" అని అన్నాడు. "నేను నీకు ఒక పని ఇస్తాను. నీవు అడవిలోకి వెళ్లి, నీకు కనిపించిన అత్యంత అందమైన పువ్వును తీసుకురా" అన్నాడు. కిరణ్ అడవిలోకి వెళ్ళాడు. అతను చాలా అందమైన పువ్వులను చూశాడు - ఎర్ర గులాబీలు, పసుపు సూర్యకాంతలు, రంగురంగుల కమలాలు. అతను ఒక పువ్వును కోయడానికి ప్రయత్నించినప్పుడల్లా, "ఇంకా అందమైన పువ్వు ఉండొచ్చు" అని ఆలోచించి, ముందుకు నడుస్తూనే ఉన్నాడు..     గంటల తరబడి వెతికి...

TET MATERIAL 2026

  ABHYASA VEDIKA TET MOCK TESTS TET PAPER 1 TET PAPER 2 CDP NOTES World Countries and Capitals Periodical Table & Properties

డిజిటల్ కిరణం - ఒక అసాధ్యమైన స్వప్నం

Image
  డిజిటల్ కిరణం - ఒక అసాధ్యమైన స్వప్నం    నల్లమల అడవుల అంచున ఉన్న ఒక చిన్న పల్లెటూరు 'లక్ష్మీపురం'. అక్కడ విద్యుత్ రావడమే గొప్ప విషయం, ఇక ఇంటర్నెట్ గురించి ఆ ఊరికి అస్సలు తెలియదు. ఆ ఊరిలో రాము అనే పద్నాలుగేళ్ల బాలుడు ఉండేవాడు. రాము తండ్రి ఒక సామాన్య రైతు.     రాముకి చిన్నప్పటి నుండి ఆకాశంలోని నక్షత్రాలను చూడటం, అవి ఎందుకు మెరుస్తున్నాయో తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం. కానీ, వాడి దగ్గర ఉన్న పాత పాఠ్యపుస్తకాల్లో దానికి సమాధానాలు దొరికేవి కావు. వాడు చదివే ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ మాస్టారు రాము తెలివితేటలు చూసి ముచ్చటపడేవారు, కానీ ఆయన దగ్గర కూడా పరిమితమైన వనరులే ఉండేవి.     ఒకరోజు గ్రామానికి కొత్తగా ఒక స్వచ్ఛంద సంస్థ వారు వచ్చి, పంచాయతీ ఆఫీసులో ఒక పాత కంప్యూటర్‌ను, శాటిలైట్ ద్వారా వచ్చే ఇంటర్నెట్ కనెక్షన్‌ను ఏర్పాటు చేశారు. అదే రాము జీవితాన్ని మార్చేసిన క్షణం.        రాము ప్రతిరోజూ బడి అయిపోయాక అక్కడికి వెళ్ళేవాడు. మొదట్లో ఆ మౌస్ పట్టుకోవడానికే భయపడిన వాడు, మెల్లమెల్లగా Google లో వెతకడం నేర్చుకున్నాడు. YouTube లో ఖగోళ శాస్త్రం (Astronomy...

రక్షా బంధన్- ఒక గణిత బంధం

  అన్నయ్య చేయి ఒక కేంద్ర బిందువు (Centre), అనురాగంతో చుట్టే రాఖీ మన పరిధి (Circumference). చెల్లెలి ప్రేమ అందులో వ్యాసార్ధమై (Radius), నిలుస్తుంది బంధం ఒక చక్కని వృత్తమై (Circle). మా ఆనందాలన్నీ సంకలనం (Addition), మా మధ్య బాధలకు వ్యవకలనం (Subtraction). సంతోషాలు ఎపుడూ గుణకారం (Multiplication), ప్రేమను పంచితే అది భాగాహారం (Division). నువ్వు నేను రెండు చరరాశులం (Variables), మన బంధం విడదీయలేని సమీకరణం (Equation). ఎప్పటికీ కలిసే సాగే సమాంతర రేఖలం (Parallel Lines), ఒకరికొకరం అండగా నిలిచే లంబ కోణం (Right Angle). నీ రక్షణ వాగ్దానం ఒక స్థిరాంకం (Constant), మన ప్రేమ విలువ కట్టలేని అనంతం (Infinity). మన అనుబంధం ఒక సమితి (Set) అయితే, అందులోని ప్రతీ మూలకం ఒక మధుర జ్ఞాపకం. మన బంధం ఒక గట్టి రేఖాఖండం (Line Segment), రెండు చివర్ల నువ్వు నేను అనే బిందువులం (Points). ప్రతి ఏటా నిరూపితమయ్యే మన ప్రేమ ఒక సిద్ధాంతం (Theorem), ఇదే మన రక్షాబంధన్ వేడుకకు మూల సూత్రం. మన బంధానికి ఉంది చక్కని సౌష్ఠవం (Symmetry), ప్రేమతో నిండి ఉంది మన హృదయ ఘనపరిమాణం (Volume). మన ప్రేమ యొక్క గ్రాఫు (Graph) ఎప్పుడూ ఊర్ధ్వముఖం, ఆనంద...

యోగాసన గణితం

గణిత సూత్రంలా, నిత్యం సాధన చేయి, జీవన రేఖ సమంగా, సరళంగా సాగుతుంది.            కోణం, కొలత సరిగా పెట్టి,            ఆసన గమనం స్థిరంగా సాగించు  త్రికోణంలా శరీరం వంచి, వృత్తంలా శ్వాస నింపుకో           సమాంతరంగా ఆలోచనలు సాగితే,          సమస్యావృత్తం ఛేదించబడుతుంది. సమీకరణంలా, సమతుల్యతను కలిగి,  అవసరంలేని వ్యయం లేకుండా జీవించు          దీర్ఘచతురస్రంలా స్థిరంగా ఉండి,          శూన్యంలా శాంతంగా ఉండు. భూమికి లంబంగా నిలబడి, గ్రాఫ్ గీసినట్టుగా, ప్రతీ కదలిక,   సమబాహు త్రిభుజంలా స్థిరంగా నిలుపుతూ...           బిందువు నుండి రేఖ, రేఖ నుండి తలం....           సమద్విబాహువులా శ్వాస తీసుకో, సమాంతర రేఖల్లా మనసును నిలబెట్టుకో భాగహార సూత్రంలా, బాధను పంచుకో, శేషం లేకుండా సున్నాకు చేరుకో           శరీరం ఒక కొలత బద్ద,           ప్రతీ...

లక్ష్యం

                                            నిన్ను నువ్వు నమ్ముకో నీ శక్తిని తెలుసుకో    చక్కని ప్రణాళికతో జీవితాన్ని దిద్దుకో  అందమైన భవిష్యత్హుకు ఆలంబన చదువు  ఆ చదువు సఫలమైతేనే  జీవితానికో వెలుగు     ఉద్వేగాల్లో కెల్లా విధ్వంసకరమైంది భయం  చేసిన తప్పులను  ఒప్పుకోవడమే  నీకు జయం  జయాపజయాలు సామాన్య విషయాలు  విజయం లభించక పోతే వద్దూ- క్రుంగి పోవడాలు       ఆత్మ విశ్వాసమే నీ అభివృద్ధికి పునాది  క్రమశిక్షణ  నీ వ్యక్తిత్వాన్ని చేయదు సమాధి  అనవసర విషయాలపై వ్యామోహం వద్దు  నిర్ణీత లక్ష్యాన్ని గాలికొదిలేయద్దు     నిరాశ, నిస్పృహలతో  క్రుంగి పోవద్దు      నీలోని    సామర్థ్య మే     ఆకాశానికి హద్దు  నెగెటివ్ ఆలోచనలు చేస్తాయి హాని పాజిటివ్ దృక్పథమే పోగొడుతుంది నైరాశ్యాన్ని     అజ్ఞానం, అహంకారం నీలోంచి  తరిమి కొట్టు...

అందమైన జీవితం

  ఒక గ్రామంలో శ్రావ్య అనే అమ్మాయి ఉండేది. ఆమె తల్లిదండ్రులు దినసరి కూలీలు.  వారి ఆర్థిక స్థితి దయనీయంగా ఉండేది. పూట గడవటానికి కూడా కష్టపడాల్సిన పరిస్థితి.  శ్రావ్యకు చదవడం అంటే చాలా ఇష్టం. కష్టపడి చదివే కూతురును అపురూపంగా చూసేవారు తల్లిదండ్రులు.    ఏదో ఒకరోజు అమ్మాయి చదువు తమ కుటుంబానికి వెలుగుని తీసుకొస్తుంది అని ఆమె తల్లిదండ్రుల గాఢమైన నమ్మకం.  శ్రావ్య తన స్కూల్లో ఎంతో పట్టుదలతో పాఠాలు నేర్చుకునేది.  తన స్నేహితులు పాఠాలను అర్థం చేసుకోలేక ఇబ్బంది పడితే,  శ్రావ్య వారికి సహాయం చేస్తూ పాఠాలు అర్థమయ్యేలా వివరించేది.  ఒకసారి తన క్లాస్‌లో ఉన్న రాము అనే విద్యార్థి పాఠాలు చదవలేకపోయి  క్రమంగా స్కూల్‌కు రావడం మానేశాడు. అతడిని చూసి బాధపడిన శ్రావ్య,  రాత్రిళ్లు తన పాఠాలు ముగించిన తర్వాత రాము ఇంటికి వెళ్లి అతనికి చదువు  నేర్పడం మొదలు పెట్టింది. కొన్ని రోజుల్లోనే రాము స్కూల్‌కు తిరిగి వచ్చి,  పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఉపాధ్యాయులు పాఠాలు  చెప్పిన తర్వాత అర్థం చేసుకోలేని విద్యార్థులకు ఉపాధ్యాయుల మార్గ దర్శకత్వంలో క్లి...

సంక్రాంతి కవిత - గణిత భావనల సమాహార సారామృతం

సంఖ్యల సంబరమో, కోణాల సందడో, సంక్రాంతి పండుగలో నడుస్తున్న రంగుల ఊరేగింపో. పతంగుల ఎగురులో ∞ (అనంతం) కలయిక, ఆకాశానికి కోణం θ చూపించే మేళమిక. ముగ్గుల గీతల్లో వృత్తాల చక్రాలు, సమచతురస్రాల తోరణాల అద్భుతాలు. సమాంతర రేఖల సౌందర్య స్పర్శ, రంగుల సమీకరణంలో ఉంటాయి మధుర వర్ణాలు  సూర్యుడి కిరణాల్లో ∑ (సమూహం) వెలుగులు, పంట పొలాల్లో √ (మూలం) జీవన అంకురాలు. చలి తూర్పుకు - ve (ఋణాత్మక) బిందువుగా, వసంతానికి + ve (ధనాత్మక) సంకేతంగా. స్నేహ బంధాలలో + (ప్లస్‌) సంకేతం, కుటుంబాల మధ్య y= mx+c సమీకరణం కూర్చే బంధం పరిమాణాల్లో φ (ఫై) అందం, ప్రతి హృదయానికి ∫ (ఇంటిగ్రల్‌) సంతోషం. సంక్రాంతి ఆరంభం సమతుల్య సమీకరణం, జీవన గణితానికి సంక్రాంతి ఒక ఉపకరణం!