ఈ రోజుల్లో క్షణం తీరిక లేని, వృత్తి పరమైన అంశాల్లో మనం ఒత్తిడిని ఎదుర్కొంటూ ఇతరులు కూడా ఒత్తిడిని ఎదుర్కోవడం చూస్తున్నాం.
ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు మనం గురయ్యే ఒత్తిడిని అందరూ share చేసుకునే వారు. కాసేపు అందరితో గడిపితే ఆ ఒత్తిడి తగ్గేది. కానీ ఉదయం లేచిన్నుండి..ఆ రాత్రి పడుకునే అవకాశం వస్తుందో రాదో తెలియనంత ఒత్తిడి.. ఉద్యోగ పరంగా కాని, ఫ్యామిలీ విషయాల వల్ల గానీ ప్రతీది ఒత్తిడికి గురి చేస్తుంది.
అయితే ఒత్తిడి అనగానే దాన్ని అందరూ negative దోరణిలో ఊహించుకుంటారు. కానీ అందులో పాజిటివ్ waves ఉన్న విషయం కూడా గుర్తించలేని పనుల్లో బిజీగా ఉంటున్నాము
పని ఒత్తిడి లో మనం మనసారా నవ్వడం లేదు...నవ్వే సందర్భాలు వచ్చినా మనం నవ్వకుండా బలవంతంగా ఎదుటి వాళ్ళ కోసం అన్నట్టు ఓ వంకర చిరునవ్వుతో దాన్ని ముగిస్తాం.
చిన్నపాటి నడకకు గానీ, వ్యాయామం చేయడం గానీ మనకు సమయం ఉండదు...అని అనుకుంటాం గానీ మనం బద్దకస్తులం అన్న విషయం మనకు తెలియదు.ఎవరన్నా చెప్పినా మనం ఒప్పుకోము.
మనకు దొరికిన సమయంలో మనకు 6 గంటలు నిద్రపోయే ఓపిక ఉండదు. ఆ సమయంలో మనం ఎంతసేపూ గతం లో జరిగి పోయిన అనవసరమైన సందర్భాలను గుర్తు తెచ్చుకుంటూనో, మన కుటుంబాల్లో వ్యక్తులు కొందర్ని ప్రేమగా పలుకరిస్తూ..ఉన్నట్టు భ్రమ పడుతూ మంచి నిద్ర పోయే సమయాన్ని భగ్నం చేసేలా వారి గురించి, వారు ఏదో సందర్భం లో అన్న చిన్న చిన్న మాటలను గుర్తు చేసుకుంటూ..మనల్ని మనమే ఈసడించుకుంటున్నాం అన్న విషయం మనకు తెలియకుండా గడిపేస్తున్నాం..
గతాన్ని, వ్యక్తుల మీద వ్యతిరేక భావాన్ని గుర్తు చేసుకోకుండా వర్తమానం లో హ్యాపీ గా గడిపే సందర్భాలు మనం కల్పించుకుని చూస్తే ఒక వారం లోనే మనం హాయిగా నిద్ర పోతాము. మన కెరీర్ పరంగా ఉండే ఒత్తిడి గానీ, కుటుంబ సభ్యుల అనారోగ్య పరంగా గానీ ఉండే ఒత్తిడిని మనం గుర్తించ వలసిందే. ఎందుకంటే ఆ ఒత్తిడి లేకుంటే మనం ఎదుర్కునే ఆ సమస్యలకూ పరిష్కారం దొరకదు..అయితే దీన్నే పాజిటివ్ ఒత్తిడి గా భావించాలి. ఒకవేళ దాన్ని negative ధోరణి లో ఆలోచించినా అది చాలా స్వల్ప కాలంలోనే ముగుస్తుంది...
ఒక్కసారి మీ బాల్యం గుర్తు తెచ్చుకోండి. మీలో అంతర్గతంగా ఏదో ఒక కళ ఉంటుంది. మీరు పాటలు పాడేవారో , బొమ్మలు వేసేవారో, 64 కళల్లో ఏదో ఒక కళ (చోరకళ ఉంటే వద్దు)
ఉన్నవారో అయితే ఆ విషయాన్ని మర్చిపోయి ఎన్ని సంవత్సరాలు అయిందో ఆలోచించండి. వీకెండ్ లో బయట గడపటం ఒకటే ప్రాధాన్యత ఇవ్వకుండా మీలోకి మీరు వెళ్ళండి. కొన్ని రోజుల్లోనే మీరు పదవ తరగతిలో గడిపిన అనుభూతి లోకి వెళ్ళిపోతారు.
మన పరిధిని మించి ఎదుటివాళ్ళు చెప్పే పనులకు No చెప్పడం నేర్చుకోండి.
Life partner కు వీలైన అంశాల్లో ఎలాంటి సహకారం అవసరమైనా అందించండి. రోజులో కొంచెం సేపు కుటుంబ సభ్యులతో సరదాగా గడపండి. ముఖ్యంగా అల్లరి చేసే చిన్న పిల్లలు మన వాళ్ళు అయినా, పక్కింటి పిల్లలు అయినా సరే..వాళ్ళతో పాటు అల్లరి చేస్తూ కాసేపు గడపండి. ఆ రోజు ఉన్న ఒత్తిడి వెంటనే refresh అవుతుంది.
ప్రతి అంశానికి time management చేసుకోండి. ఆ టైమ్ లో వేరే టైమ్ కు సంబందించిన ఆలోచనలు మానేయండి.
MUNINDER RAJU
Comments