Posts

Showing posts from May, 2021

విద్యలో కృత్రిమ మేధస్సు

విద్యలో కృత్రిమ మేధస్సు: భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి A Muninder Raju కృత్రిమ మేధస్సు (Artificial Intelligence - AI) మన జీవితంలోని ప్రతి రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది. విద్యారంగం కూడా దీనికి మినహాయింపు కాదు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు... అందరూ ఈ శక్తివంతమైన సాంకేతికత ప్రభావానికి లోనవుతున్నారు. AI కేవలం ఒక టెక్నాలజీ మాత్రమే కాదు, అభ్యాస ప్రక్రియను మరింత సమర్థవంతంగా, వ్యక్తిగతంగా మరియు అందుబాటులోకి తీసుకురాగల ఒక శక్తివంతమైన సాధనం. ఈ కథనంలో, విద్యలో AI ఎలా సహాయపడుతుందో, దాని ప్రయోజనాలు, సవాళ్లు మరియు భవిష్యత్తును విశ్లేషిద్దాం. విద్యార్థులకు కృత్రిమ మేధస్సు ప్రయోజనాలు AI విద్యార్థుల అభ్యాస అనుభవాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది. ప్రతి విద్యార్థి యొక్క ప్రత్యేక అవసరాలను తీర్చడంలో ఇది సహాయపడుతుంది. వ్యక్తిగతీకరించిన అభ్యాసం (Personalized Learning) AI ప్రతి విద్యార్థి యొక్క అభ్యాస శైలి, వేగం మరియు బలాలను అర్థం చేసుకొని, వారికి తగిన పాఠ్య ప్రణాళికలను రూపొందిస్తుంది. ఉదాహరణకు, ఒక విద్యార్థి గణితంలో ఒక నిర్దిష్ట భావనను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడితే, AI ఆ ర...

Useful websites for Teachers

MUNINDERRAJU.COM - for Teachers

My Youtube channel Link

My Youtube channel Link

My Karaoke Songs

                      https://www.facebook.com/100001547358300/videos/2126724350722456/  

చారి సర్...ఓ మధుర జ్ఞాపకం

Image
సముద్రం లో ఒక నీటి చుక్క ... విలువ లేదనుకుంటాము. ఆ నీటిచుక్కే బీడుబారిన పొలాలను...పంటలు పండించడానికి ఆవిరై కిందపడే వాన చినుకు కావొచ్చుగా.. అలా విద్యార్థుల ఎడారి మనసులను హరితవనం చేయడానికే మా దగ్గర కొచ్చాడు మా చారి సర్..తాండ్యాల రామచంద్రాచారి గారు. చెన్నూరు వాస్తవ్యులు. సముద్రపు అలలను ఎంత ఆస్వాదిస్తామో..ఆయన పాఠాలను అలా మైమర్చిపోయి వింటాము...ఇక్కడ ఉన్న మన మనసుని ఎక్కడో జ్ఞానాన్వేషణ(జనరల్ నాలెడ్జ్)  కొరకు పంపి ఆ వెంటనే మనం అన్వేషించిన విషయాన్ని తోటి విద్యార్థులకు పంచమని చెప్పే స్ఫూర్తి ఆయన నేర్పిందే... బాగా చదివే విద్యార్థులను మాత్రమే ప్రోత్సహించడం ఆయన తత్వం కాదు. చదువులో వెనకబడి వెనక బెంచి లో దాక్కున్న విద్యార్థి లో సైతం సృజనాత్మకత అనే మొక్క నాటడం ..ఆయన వల్లనే అవుతుంది. సమాజానికి సేవ చేసి అసువులు బాసిన ఒక నాయకుని మరణం మనల్ని ఎంత కలచి వేస్తుందో ..ఒక మంచి ఉపాధ్యాయుని ఎడబాటు కూడా మనలో అంత వేదన నింపుతుంది. ఆయన దగ్గర భాష నేర్చుకున్న వారెందరో ఎన్నో రంగాల్లో స్థిరపడ్డా ఆయన జ్ఞాపకాలు వదలని వారెందరో ఉన్నారు..నిజానికి తాను నేర్పింది భాష కాదు..ఒక జీవితం...జీవితాన్ని అందంగా తీర్చి దిద్దుకోవడానికి...

కోవిడ్ నేపథ్యంలో గణిత శాస్త్ర బోధనా మెళకువలు ( వ్యాస రచన )

                                                                                                                                                                                                                                                                                              ...

నాన్నా ఎప్పుడొస్తావ్ !

నాన్నా ఎప్పుడొస్తావ్ ! లక్ష్యం                                                                       కవిత    నిన్ను నువ్వు నమ్ముకో నీ శక్తిని తెలుసుకో    చక్కని ప్రణాళికతో జీవితాన్ని దిద్దుకో  అందమైన భవిష్యత్హుకు ఆలంబన చదువు  ఆ చదువు సఫలమైతేనే  జీవితానికో వెలుగు     ఉద్వేగాల్లో కెల్లా విధ్వంసకరమైంది భయం  చేసిన తప్పులను  ఒప్పుకోవడమే  నీకు జయం  జయాపజయాలు సామాన్య విషయాలు  విజయం లభించక పోతే వద్దూ- క్రుంగి పోవడాలు      ఆత్మ విశ్వాసమే నీ అభివృద్ధికి పునాది  క్రమశిక్షణ  నీ వ్యక్తిత్వాన్ని చేయదు సమాధి  అనవసర విషయాలపై వ్యామోహం వద్దు  నిర్ణీత లక్ష్యాన్ని గాలికొదిలేయద్దు     నిరాశ, నిస్పృహలతో  క్రుంగి పోవద్దు      నీలోని    సామర్థ్య మే     ఆకాశానికి హద్దు...