Posts

Showing posts from December, 2024

REAL AI ......పదవ భాగం

REAL AI పదవ భాగం రచయిత : అడ్లూరి మునిందర్ రాజు హైదరాబాద్. తెల్లవారుజామున ఏడు గంటలు. నగరం మేల్కొంటోంది. ఇళ్ళలో వెలుతురు వస్తోంది. రోడ్లపై వాహనాల రద్దీ నెమ్మదిగా పెరుగుతోంది. పూల అమ్మకందారులు తమ బుట్టలు సర్దుకుంటున్నారు. పాతబస్తీ సందుల నుండి వేడివేడి ఇడ్లీల వాసన వస్తోంది. అన్నీ సాధారణంగానే ఉన్నాయి. కానీ ఒక పరిశోధనా కేంద్రం (రీసెర్చ్ లాబ్)లో మాత్రం... అన్విత నేల మీద కూర్చుని ఉంది. చేతుల్లో ముఖం దాచుకుంది. ఒళ్ళు వణుకుతోంది. చెమట ఇంకా ఆరలేదు. శ్వాస వేగంగా, ఆందోళనగా వస్తోంది. సిద్ధార్థ్ రెండు అడుగుల దూరంలో నిలబడ్డాడు. ఆమె "నా దగ్గరకు రావొద్దు" అని అరిచింది. కింద కూర్చుండి పోయింది. అతను ముందుకు వెళ్ళలేదు, అలాగని వెనక్కీ వెళ్ళలేదు. అతని మనసులో వేయి ప్రశ్నలు. తెరపై కనిపించిన ఆ రూపం... ఆమె "నాన్నా" అని అరిచింది. ఆమె తండ్రి పదిహేను సంవత్సరాల కిందటే మరణించారు. మరి ఆ ముఖం ఆమె తండ్రిదా? లేక... "శరీరంలో ఒత్తిడి స్థాయిలు ప్రమాదకరంగా ఉన్నాయి. రక్తంలో హార్మోన్ల మార్పులు గమనించాను. తక్షణమే జోక్యం చేసుకోవడానికి అనుమతి కోరుతున్నాను." నోవా హెచ్చరించింది. అన్విత తల పైకెత్తింది. ...

గణితం ద్వారా python నేర్చుకుందాం

Image
( తేదీ 21.12.2024 న SCERT Telangana లో జరిగిన సెమినార్ కోసం నేను పంపించిన పరిశోధనా వ్యాసం ) గణితం ద్వారా PYTHON నేర్చుకుందా ం Presented by A.MUNINDER RAJU S.A (Maths) Govt High School, Eidgaon,Nirmal muninderadluri@gmail.com 9440040744 Theme: "Timeless Journey: From Vedic Math to Quantam Computing" Sub Theme: "Digital resources and apps for Mathematics Learning" Title: "గణితం ద్వారా python అభ్యసనం" పాఠశాల స్థాయి విద్యార్థులకు PYTHON నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ python గణితం ద్వారా నేర్చుకోవడం ఆసక్తి కల్గించే ఒక అంశం. పరిచయ ం: నేటి డిజిటల్ యుగంలో, టెక్నాలజీ అన్ని రంగాల్లోనూ విస్తరిస్తోంది. ఈ క్రమంలో, భవిష్యత్తు లో విద్యార్థులు విజయవంతం కావాలంటే ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు కూడా నేర్చుకోవాలి. అందుకే హైస్కూల్ విద్యార్థులకు PYTHON నేర్చుకోవడం ఒక అవసరం అని భావించవచ్చు. PYTHON నేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు: సమస్య పరిష్కార నైపుణ్యాలు: PYTHON నేర్చుకోవడం ద్వారా విద్యార్థులు సమస్యలను విశ్లేషి...