REAL AI ......పదవ భాగం

REAL AI పదవ భాగం రచయిత : అడ్లూరి మునిందర్ రాజు హైదరాబాద్. తెల్లవారుజామున ఏడు గంటలు. నగరం మేల్కొంటోంది. ఇళ్ళలో వెలుతురు వస్తోంది. రోడ్లపై వాహనాల రద్దీ నెమ్మదిగా పెరుగుతోంది. పూల అమ్మకందారులు తమ బుట్టలు సర్దుకుంటున్నారు. పాతబస్తీ సందుల నుండి వేడివేడి ఇడ్లీల వాసన వస్తోంది. అన్నీ సాధారణంగానే ఉన్నాయి. కానీ ఒక పరిశోధనా కేంద్రం (రీసెర్చ్ లాబ్)లో మాత్రం... అన్విత నేల మీద కూర్చుని ఉంది. చేతుల్లో ముఖం దాచుకుంది. ఒళ్ళు వణుకుతోంది. చెమట ఇంకా ఆరలేదు. శ్వాస వేగంగా, ఆందోళనగా వస్తోంది. సిద్ధార్థ్ రెండు అడుగుల దూరంలో నిలబడ్డాడు. ఆమె "నా దగ్గరకు రావొద్దు" అని అరిచింది. కింద కూర్చుండి పోయింది. అతను ముందుకు వెళ్ళలేదు, అలాగని వెనక్కీ వెళ్ళలేదు. అతని మనసులో వేయి ప్రశ్నలు. తెరపై కనిపించిన ఆ రూపం... ఆమె "నాన్నా" అని అరిచింది. ఆమె తండ్రి పదిహేను సంవత్సరాల కిందటే మరణించారు. మరి ఆ ముఖం ఆమె తండ్రిదా? లేక... "శరీరంలో ఒత్తిడి స్థాయిలు ప్రమాదకరంగా ఉన్నాయి. రక్తంలో హార్మోన్ల మార్పులు గమనించాను. తక్షణమే జోక్యం చేసుకోవడానికి అనుమతి కోరుతున్నాను." నోవా హెచ్చరించింది. అన్విత తల పైకెత్తింది. ...

ఒక గణిత ప్రేమికుని భావుకత ...ఈ (గణిత ) కవిత

 


ఇన్నాళ్లు sin 90 డిగ్రీలా  నా జీవితంలో ఒక్కణ్ణే అనుకున్నా …

cosec 30 విలువలా మనం కలిసి వెళ్తుంటే అందరి చూపులూ మనపైనే ….

నువ్వు నన్ను అడిగావు గుర్తుందా ….

ఏం చూసి నాకు 143 చెప్పావని....

తాజ్ మహల్ చూడగానే ఎంత స్వాంతన పొందుతామో ఆ నిర్మాణంలో ఉన్న గోల్డెన్ రేషియో నీ ముఖార విందం లో చూసాను నేను. ...

స్థూపంలా చుట్టిన చాప వైశాల్యం కనుక్కోవటానికి వ్యాసార్థం కోసం ...

నేను బేలగా వెంపర్లాడుతున్నప్పుడు ...

నీవు అలవోకగా చాపను నేలపై పరిచి 

పొడవు వెడల్పులతో వైశాల్యం కనుక్కుని చెప్పిన నీ తెలివికి అబ్బుర పడిపోయా. ..

ఒక బిందువు నుండి బయలు దేరి కిరణం లా ముందుకు వెల్దామనుకున్నా . ..

కానీ నిన్ను చేరగానే నీతో కలిసి రేఖాఖండంలా కలిసి ఉందామని ఆగిపోయా…

వృత్తానికి స్పర్శరేఖలా నువు నన్ను ఎప్పుడూ అంటిపెట్టుకుని ఉండు కానీ ఛేదన రేఖలా మారి నా మనసును ఎప్పుడూ అర్ధ వృత్త ఖండాలుగా మార్చొద్దు 

జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ పై విలువలా  స్థిరంగా ఉండాలి ..

తప్ప లవ హారాల్లో నువ్వా నేనా అంటూ విలువలు పెంచుకుని మన నిష్పత్తిని మార్చుకోవద్దు.. 

శూన్యకోణం లో కలిసిన మన మనసులు అవసరాన్ని బట్టి లంబకోణం, సరళ కోణం వరకు దూరంగా వెళ్లినా వెంటనే పరావర్తనం కోణం లా మారి ఒకరికొకరం దరి చేరే దారిలోనే పయనించాలి… 

రెండు బిందువుల మధ్య దూరం 

పదవతరగతి విద్యార్థి ఇట్టే కనిపెట్టేస్తాడు ...

కానీ రెండు మనసుల మధ్య పెరిగిన దూరం శ్రీనివాస రామానుజన్ సిద్ధాంతం కూడా కనిపెట్టలేదు తెలుసా ....

జీవితంలో ఎప్పుడైనా నీ అహంకారం విలువ పెరిగినా సమాజంలో నీ విలువ ఎప్పుడూ కాపాడటానికి  .....

అవసరమైతే నా విలువ దిగజార్చుకుని నీ తలపై ఘాతాంకం సున్నాలా నిలిచిపోతా నీ విలువను సమాజానికి ఎప్పుడూ ఒకేలా చూపుతా ...


                       నీ  ప్రేమను పొందిన 

                       ఒక గణిత ప్రేమికుడు

Comments

Popular posts from this blog

సీ..Real AI ( మొదటి భాగం ) Weekly Serial

అందమైన జీవితం