REAL AI ......పదవ భాగం

REAL AI పదవ భాగం రచయిత : అడ్లూరి మునిందర్ రాజు హైదరాబాద్. తెల్లవారుజామున ఏడు గంటలు. నగరం మేల్కొంటోంది. ఇళ్ళలో వెలుతురు వస్తోంది. రోడ్లపై వాహనాల రద్దీ నెమ్మదిగా పెరుగుతోంది. పూల అమ్మకందారులు తమ బుట్టలు సర్దుకుంటున్నారు. పాతబస్తీ సందుల నుండి వేడివేడి ఇడ్లీల వాసన వస్తోంది. అన్నీ సాధారణంగానే ఉన్నాయి. కానీ ఒక పరిశోధనా కేంద్రం (రీసెర్చ్ లాబ్)లో మాత్రం... అన్విత నేల మీద కూర్చుని ఉంది. చేతుల్లో ముఖం దాచుకుంది. ఒళ్ళు వణుకుతోంది. చెమట ఇంకా ఆరలేదు. శ్వాస వేగంగా, ఆందోళనగా వస్తోంది. సిద్ధార్థ్ రెండు అడుగుల దూరంలో నిలబడ్డాడు. ఆమె "నా దగ్గరకు రావొద్దు" అని అరిచింది. కింద కూర్చుండి పోయింది. అతను ముందుకు వెళ్ళలేదు, అలాగని వెనక్కీ వెళ్ళలేదు. అతని మనసులో వేయి ప్రశ్నలు. తెరపై కనిపించిన ఆ రూపం... ఆమె "నాన్నా" అని అరిచింది. ఆమె తండ్రి పదిహేను సంవత్సరాల కిందటే మరణించారు. మరి ఆ ముఖం ఆమె తండ్రిదా? లేక... "శరీరంలో ఒత్తిడి స్థాయిలు ప్రమాదకరంగా ఉన్నాయి. రక్తంలో హార్మోన్ల మార్పులు గమనించాను. తక్షణమే జోక్యం చేసుకోవడానికి అనుమతి కోరుతున్నాను." నోవా హెచ్చరించింది. అన్విత తల పైకెత్తింది. ...

కోవిడ్ నేపథ్యంలో గణిత శాస్త్ర బోధనా మెళకువలు ( వ్యాస రచన )

                                                                                                                                                                                                                                                                                                                                 (జిల్లా విద్యాశాఖ ఆదిలాబాద్   మరియు TMF ఆదిలాబాద్  గణిత దినోత్సవం 2020  సందర్భంగా  నిర్వహించిన పోటీలలో ప్రథమ బహుమతి పొందిన వ్యాసం  )


     కరోనా మహమ్మారి ఎన్నో రంగాలను కుదిపి వేసింది. దాంట్లో విద్యారంగం ఒకటి. ఆర్థిక పరమైన అంశాల్లో ఒడిడుకులు ఉండటం సహజం. దాంట్లో కరోనా  ఒకటి...మంచి ప్రయత్నాలు చేస్తూ పోతే ఆర్థికంగా ఒకసారి క్రుంగిపోయినా మళ్ళీ బయట పడే మార్గాలు ఎన్నో లభిస్తాయి. కానీ విద్య అలా కాదు. ఒక లక్ష్యం సాధించే దిశలో విద్యార్థి ఎన్నో మెట్లు అధిగమించాలి. అందులో ఒక మెట్టు చెడిపోయి మరో మెట్టు ఎక్కే అవకాశం లేకపోతే ఆ విద్యార్థి చేరుకో వలసిన గమ్యం దూరం కావొచ్చు. నిజంగా కరోనా పరిస్థితులు విద్యార్థుల భావి జీవితాలపై భయంకర ప్రభావాన్ని చూపిస్తున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

    ఈ రోజు డిజిటల్ విద్య పేరుతో అనేకమైన అంశాలను కలబోసి ఎన్నో రకాలుగా గాడ్జెట్ల ద్వారా విద్యార్థికి అవసరమైన మెటీరియల్ చేర వేస్తున్నాము.    ఆర్థిక వనరులు అందుబాటులో ఉండి తమ పిల్లల అవసరాలు గుర్తించి ఖర్చుకు వెనుకాడకుండా తమ పిల్లలకు అవసరమైన   గాడ్జెట్స్ అందుబాటులో ఉంచే తల్లిదండ్రులు,   చదువే లక్ష్యంగా, సమాచార సేకరణ ధ్యేయంగా ముందుకు సాగే విద్యార్థులకు ఈనాటి డిజిటల్ బోధన నిజంగా ఒక వరం అనే చెప్పాలి.


     కానీ మన భారత దేశంలో విద్య పేద పిల్లల భవిష్యత్తు కు  సంబంధించిన అంశం.  మరియు వారి భావి జీవితాల్లో ఉచిత విద్య ద్వారా ప్రభుత్వమే అనేకమైన పద్ధతుల్లో చేదోడుగా ఉంటూ వస్తుంది.  చదువు    ద్వారా ఆ విద్యార్థి ఎదిగితే ఆ కుటుంబమే కాకుండా భావి తరాలు విజ్ఞాన పరంగా ఎదుగుతాయి. దానివల్ల     సామాజిక  పరమైన అభివృద్ధి జరుగుతుంది.


    ఈ రోజు దారిద్య్రరేఖ కు దిగువన ఉన్న కుటుంబాల పిల్లలు  ఎక్కువ శాతం  చదువుకు దూరం అవుతున్నారని చెప్పక తప్పదు. మారుమూల ప్రాంతాలకు నెట్ సౌకర్యం లేదు. కనీసం ఫోన్ కలవని గ్రామాలు వేలల్లో ఉన్నాయి.     

జియో లాంటి   నెట్   connections ఉన్నప్పటికీ   smart phone లేదు.

విద్యార్థికి పంపిన pdf పేజీ కూడా open కావడం లేదు.


     ప్రస్తుత తరుణంలో దాదాపు ప్రతి ఇంటిలో  టీవీ ఉండటం, విద్యార్థికి చదువుకోవడానికి అవసరమైన Text Books అందించడం ,  TV మాధ్యమం ద్వారా డిజిటల్ పాఠాలు అందించడం ద్వారా ప్రత్యక్ష బోధన లో పొందే అనుభూతి గానీ, వ్యక్తిగత సామర్థ్యం పెంపొందించు కోవడం గానీ కొంత ఇబ్బంది అయినప్పటికీ విద్యార్థి ఒక సంవత్సరం వెనుక బడకుండా ఉండే అవకాశం ప్రభుత్వం కల్పించింది.   తల్లి దండ్రులు కూడా పరిస్థితిని అర్థం చేసుకుని ఉపాధ్యాయులకు సహకరించడంవల్ల ఎక్కువ  శాతం లోనే డిజిటల్ తరగతులు విజయ వంతం అవుతున్నాయి.


     ఈ పరిస్థితులు పూర్తిగా చక్కబడి విద్యార్థి బడికి రావాలని ప్రతి ఉపాధ్యాయుడు ఎదురు చూస్తున్నాడు. అందులో గణితం, ఫిజిక్స్, chemistry లాంటి సబ్జెక్ట్ ఉపాధ్యాయులు విద్యార్థుల కు అందే డిజిటల్ బోధన తో వారు సంతృప్తి చెందడం లేదు. ఉపాధ్యాయులు విద్యార్థి సామర్ధ్యాలను అర్థం చేసుకుని వారి సమీపంలో అవసరానికి అనుగుణంగా చెప్పడంలో ఉన్న తృప్తి డిజిటల్ కంటెంట్ అందించడం ద్వారా అనుభూతి పొందలేక పోతున్నారు. అదే విధంగా పై మూడు సబ్జెక్టులు డిజిటల్ కంటెంట్ ద్వారా విద్యార్థులు అర్థం చేసుకోలేక పోతున్నారు అనేది ఎన్నో సర్వేల్లో బయట పడుతూనే ఉంది.


     ఇప్పుడు పైన చెప్పుకున్న సందర్భాలను మనం చూస్తున్నవే..కొత్తవి ఏమి కావు..అందరికీ తెలిసిన అంశాలే.

 గణిత ఉపాధ్యాయులుగా మనం ఆలోచనల్లో తార్కికంగా ముందు ఉంటాము కాబట్టి ఒక కొత్త కోణం లో ముందుకు వెళదాము.


        పేద విద్యార్థులకు సంక్షేమ పథకాలు అందించడంలో ప్రభుత్వాలు ఎప్పుడూ అనుకూలంగానే ఉంటాయి. విద్యార్థి కి నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వాల లక్ష్యం. ఆ విద్య ఈ రోజు offline లో కొనసాగుతూ వస్తుంది. కరోనా పరిస్థితుల ప్రభావం పూర్తిగా తగ్గిపోయినా ప్రభుత్వాలు  భవిష్యత్ లో కూడా online వైపే  తరగతి గదులు  కొనసాగించే అవకాశం కూడా లేకపోలేదు.

ప్రతి ఉపాధ్యాయునికి ఒక laptop, digital meterial అందిస్తూ  ప్రతి విద్యార్థి కి Text books కు బదులుగా టాబ్ లేదా laptop అందించాలనే ఆలోచన ప్రభుత్వాలకు రావడానికి ఎంతో దూరం లేదు. పాఠశాలల మౌలిక వసతులకు అయ్యే వేల కోట్ల రూపాయల ఖర్చుకు బదులుగా మారుమూల ప్రాంతాల్లో, తండాల్లో కూడా high speed internet వసతి కల్పించడం ప్రభుత్వాలు తలుచుకుంటే ఎంతోకాలం పట్టదు.  అప్పుడు మనకు ప్రతి ఉపాధ్యాయునికి తన సబ్జెక్ట్ లో 40 మంది విద్యార్థులను కేటాయించే అవకాశం ఉండవచ్చు. ఆ విద్యార్థులంతా  మన పాఠశాల విద్యార్థులు అని కాకుండా  రాష్ట్రం లోని ఏ ప్రాంతం నుండి అయినా  మనకు కేటాయించే అవకాశం ఉంటుంది. వారికి మనం గూగుల్ తరగతి లాంటి రూపములో తరగతులు నిర్వహిస్తూ ఉపాధ్యాయులు  ఎవరికి వారు స్వంతగా డిజిటల్ కంటెంట్ తయారు చేయవలసి ఉంటుంది.


       కేవలం రెండు మూడు అంశాలు ప్రభుత్వాలు అధిగమిస్తే అప్పుడు ఉపాధ్యాయులు తమ నైపుణ్యాలను కొత్త పద్దతిలో మెరుగు పర్చు కోవలసి ఉంటుంది. దానికి తోడు వచ్చే విద్యా సంవత్సరం నూతన జాతీయ విద్యా విధానంలో  6 వ తరగతి నుండే కోడింగ్ లాంటి అంశాలు ప్రవేశ పెడుతున్నారు  కాబట్టి ఆ తరగతులు కూడా గణిత ఉపాధ్యాయుల ద్వారానే కొంత కాలం సేవలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. 


      మరి ఇలాంటి సందర్భంలో మనం  గణిత ఉపాధ్యాయులుగా బోధన మెరుగు పర్చుకోడంలో  వెనుకంజ వేయడం సరి కాదు. బోధన లో భారీ మార్పులు వచ్చినప్పుడు ఎక్కువ భారం, బాధ్యత కూడా గణిత ఉపాధ్యాయుని పైనే ఉంటుంది. CCE మెథడ్ లో కూడా  అలాంటి ఇబ్బందులు మనం  ఎదుర్కొంటూనే మంచి నాణ్యమైన విద్యను  విద్యార్థులకు   అందించడం  లో ముందే ఉంటున్నాము.

       రాబోయే పరిస్థితులు ఇలా జరుగ వచ్చు అనుకున్నప్పుడు మాత్రమే మనల్ని మనం update చేసుకోవడానికి వీలవుతుంది. ఆ మాట కోస్తే       గణిత ఉపాధ్యాయుడు పరిస్థితులను బట్టి కాక తనకు తాను ఎప్పుడూ update అవుతూ ఉండాలి.


      ప్రస్తుత తరుణంలో అయినా పరిస్థితుల్లో పైన చర్చించిన  మార్పు వచ్చినా   online విద్య లో గణితానికి సంబంధించిన కంటెంట్ అందించడానికి మనం ఇప్పటినుండే కొన్ని అంశాలు నేర్చుకోవడం మంచిది.


     ముఖ్యమైన అంశం ఏమిటంటే ఎక్కడినుండో వచ్చిన కంటెంట్ విద్యార్థికి forward చేయడం కన్నా మనం స్వంతగా కొంత కంటెంట్ తయారు చేసి మన విద్యార్థులకు పంపితే విద్యార్థి మన బోధనకు అలవాటు పడ్డాడు కాబట్టి తొందరగా నేర్చుకునే అవకాశం ఉంటుంది.  దానికి గాను మనం కొన్ని సాంకేతిక అంశాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలి.


Ggogle drive కి one drive కి తేడా ఏమిటి?

Excel మరియు గూగుల్ షీట్స్ రెండూ ఒకటేనా ?

Power point, slides తో ఏ విధంగా లెసన్స్ తయారు చేయాలి ?

ఏ పరికరాలు లేకుండా కేవలం మన దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ తో గణిత సమస్యలు విద్యార్థికి అర్థం అయ్యేలా చేయవచ్చా ?

గూగుల్ class room ద్వారా విద్యార్థులకు నిజంగా తరగతి గది లాంటి అనుభూతి కలుగ జేయవచ్చా..

ఇలాంటి ఎన్నో సాంకేతిక అంశాలను మనం ప్రాక్టికల్ గా చేస్తూ పోతుంటేనే డిజిటల్ బోధన చేయడములో మనం కూడా పాలు పంచు కోవచ్చు.


నా పరంగా కొవిడ్ నేపథ్యంలో నేను చేసిన  good practices కొన్ని ఇక్కడ ప్రస్తావిస్తాను.


ప్రభుత్వం online తరగతుల ప్రకటన చేయక ముందే నేను GHS BOATH మరియు AMR MATHS & TECH అనే YouTube channels create చేసి కొన్ని లెసన్స్  అందించాను. ( https://youtube.com/channel/UCuRA9MD8suumXHtBkQGzU9Q )


తర్వాత విద్యాశాఖ ద్వారా వచ్చిన worksheets విద్యార్థులకు అర్థం అయ్యేలా ఉదాహరణలతో వివరించాను. 304 మంది విద్యార్థులు కూడా నా YouTube channel కు subscribe అయ్యారు.    (https://youtube.com/user/1muninder  )


గూగుల్ తరగతి ద్వారా గణితం తరగతులు నిర్వహించడానికి Gazeted HM group లో request setember 10 న  పంపాను. 6 నుండి 10 తరగతులకు google classroom ద్వారా గణితం తరగతులు నిర్వహిస్తానని కూడా చెప్పడం జరిగింది. 


ప్రభుత్వం online తరగతుల ప్రకటన చేయక ముందే కాంప్లెక్స్ HM గా complex సమావేశం ZOOM ద్వారా నిర్వహించాను.


గణిత దినోత్సవం సందర్భంగా బోథ్ మండల స్థాయిలో online వ్యాసరచన నిర్వహించాను.   (https://forms.gle/ttF9LcPAR5YorkEH9)



గణిత దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయిలో శ్రీనివాస రామానుజన్ క్విజ్ పోటీ నిర్వహించాను.     https://forms.gle/81oVkAcAEroUQeFQ8 

ఇప్పటికే 2841 మంది ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆ క్విజ్ లో పాల్గొన్నారు.


ఎంత success అయ్యాము అని కాదు..ఏదో ఒకటి చేస్తూ పోవాలి కదా అని ముందుకు వెళ్తున్నాను.


ప్రస్తుతం బోథ్ మండలం లో zoom app ఉన్న పదవ తరగతి విద్యార్థులందరికీ గణితం తరగతులు నిర్వహించడానికి మండల ప్రధానోపాధ్యాయులకు request పంపాను. కొన్ని పేర్లు వచ్చాయి.  త్వరలో తరగతులు ప్రారంభిస్తాను.      మండల   స్థాయిలో success అయితే జిల్లా స్థాయిలో తరగతులు నిర్వహించాలని నా కోరిక.


OBS స్టూడియో course కూడా నేర్చుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు మీడియం విద్యార్థులందరికీ ఉచితంగా గణిత తరగతులు youtube Live ద్వారా అందించాలన్నదే నా తాపత్రయం.

గణిత దినోత్సవం తర్వాత ఆదిలాబాద్ విద్యాశాఖ మరియు TMF ఆదిలాబాద్ ల సహకారంతో జూమ్ తరగతుల ద్వారా వారానికి ఒక రోజు  నాకు తెలిసిన technical knowledge share చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను.


నాకేదో తెలుసని కాదు..knowledge share చేస్తూ పోతే మరింత నేర్చుకునే అవకాశం వస్తుందని చిన్న స్వార్థం కూడా... 


muninderadluri@gmail.com


Comments

Popular posts from this blog

సీ..Real AI ( మొదటి భాగం ) Weekly Serial

అందమైన జీవితం