లక్ష్యం
- Get link
- X
- Other Apps
నిన్ను నువ్వు నమ్ముకో నీ శక్తిని తెలుసుకో
చక్కని ప్రణాళికతో జీవితాన్ని దిద్దుకో
అందమైన భవిష్యత్హుకు ఆలంబన చదువు
ఆ చదువు సఫలమైతేనే
జీవితానికో వెలుగు
ఉద్వేగాల్లో కెల్లా విధ్వంసకరమైంది భయం
చేసిన తప్పులను ఒప్పుకోవడమే నీకు జయం
జయాపజయాలు సామాన్య విషయాలు
విజయం లభించక పోతే వద్దూ- క్రుంగి పోవడాలు
ఆత్మ విశ్వాసమే నీ అభివృద్ధికి పునాది
క్రమశిక్షణ నీ వ్యక్తిత్వాన్ని చేయదు సమాధి
అనవసర విషయాలపై వ్యామోహం వద్దు
నిర్ణీత లక్ష్యాన్ని గాలికొదిలేయద్దు
నిరాశ, నిస్పృహలతో క్రుంగి పోవద్దు
నీలోని సామర్థ్య మే ఆకాశానికి హద్దు
నెగెటివ్ ఆలోచనలు చేస్తాయి హాని
పాజిటివ్ దృక్పథమే పోగొడుతుంది నైరాశ్యాన్ని
అజ్ఞానం, అహంకారం నీలోంచి తరిమి కొట్టు
విజ్ఞానం, మమకారం నీతో చెలిమి కట్టు
మంచి పుస్తకాలను నేస్తాలుగా మాలచుకో
మంచి ఆశయాలను నీ మనసులో నింపుకో
- Get link
- X
- Other Apps
Comments