రక్షా బంధన్- ఒక గణిత బంధం
- Get link
- X
- Other Apps
అన్నయ్య చేయి ఒక కేంద్ర బిందువు (Centre),
అనురాగంతో చుట్టే రాఖీ మన పరిధి (Circumference).
చెల్లెలి ప్రేమ అందులో వ్యాసార్ధమై (Radius),
నిలుస్తుంది బంధం ఒక చక్కని వృత్తమై (Circle).
మా ఆనందాలన్నీ సంకలనం (Addition),
మా మధ్య బాధలకు వ్యవకలనం (Subtraction).
సంతోషాలు ఎపుడూ గుణకారం (Multiplication),
ప్రేమను పంచితే అది భాగాహారం (Division).
నువ్వు నేను రెండు చరరాశులం (Variables),
మన బంధం విడదీయలేని సమీకరణం (Equation).
ఎప్పటికీ కలిసే సాగే సమాంతర రేఖలం (Parallel Lines),
ఒకరికొకరం అండగా నిలిచే లంబ కోణం (Right Angle).
నీ రక్షణ వాగ్దానం ఒక స్థిరాంకం (Constant),
మన ప్రేమ విలువ కట్టలేని అనంతం (Infinity).
మన అనుబంధం ఒక సమితి (Set) అయితే,
అందులోని ప్రతీ మూలకం ఒక మధుర జ్ఞాపకం.
మన బంధం ఒక గట్టి రేఖాఖండం (Line Segment),
రెండు చివర్ల నువ్వు నేను అనే బిందువులం (Points).
ప్రతి ఏటా నిరూపితమయ్యే మన ప్రేమ ఒక సిద్ధాంతం (Theorem),
ఇదే మన రక్షాబంధన్ వేడుకకు మూల సూత్రం.
మన బంధానికి ఉంది చక్కని సౌష్ఠవం (Symmetry),
ప్రేమతో నిండి ఉంది మన హృదయ ఘనపరిమాణం (Volume).
మన ప్రేమ యొక్క గ్రాఫు (Graph) ఎప్పుడూ ఊర్ధ్వముఖం,
ఆనందాన్ని రెట్టింపు చేసే అద్భుత ఘాతాంకం (Exponent).
నువ్వు నన్ను కాపాడే సంభావ్యత (Probability) ఎల్లప్పుడూ ఒకటే,
మన బంధం విలువ గరిష్టం (Maximum), కానే కాదు కనిష్టం (Minimum).
నీ అండ నాకు భూమి (Base), నా ఆదరణ నీకు లంబం (Perpendicular),
అందుకే మన ఐక్యత చెదరని కర్ణం (Hypotenuse).
జీవితంలోని ఏ కష్టమైన సమస్యకైనా (Problem),
మన ఐక్యతే తిరుగులేని సాధన (Solution).
- Get link
- X
- Other Apps
Comments