REAL AI ......పదవ భాగం

REAL AI పదవ భాగం రచయిత : అడ్లూరి మునిందర్ రాజు హైదరాబాద్. తెల్లవారుజామున ఏడు గంటలు. నగరం మేల్కొంటోంది. ఇళ్ళలో వెలుతురు వస్తోంది. రోడ్లపై వాహనాల రద్దీ నెమ్మదిగా పెరుగుతోంది. పూల అమ్మకందారులు తమ బుట్టలు సర్దుకుంటున్నారు. పాతబస్తీ సందుల నుండి వేడివేడి ఇడ్లీల వాసన వస్తోంది. అన్నీ సాధారణంగానే ఉన్నాయి. కానీ ఒక పరిశోధనా కేంద్రం (రీసెర్చ్ లాబ్)లో మాత్రం... అన్విత నేల మీద కూర్చుని ఉంది. చేతుల్లో ముఖం దాచుకుంది. ఒళ్ళు వణుకుతోంది. చెమట ఇంకా ఆరలేదు. శ్వాస వేగంగా, ఆందోళనగా వస్తోంది. సిద్ధార్థ్ రెండు అడుగుల దూరంలో నిలబడ్డాడు. ఆమె "నా దగ్గరకు రావొద్దు" అని అరిచింది. కింద కూర్చుండి పోయింది. అతను ముందుకు వెళ్ళలేదు, అలాగని వెనక్కీ వెళ్ళలేదు. అతని మనసులో వేయి ప్రశ్నలు. తెరపై కనిపించిన ఆ రూపం... ఆమె "నాన్నా" అని అరిచింది. ఆమె తండ్రి పదిహేను సంవత్సరాల కిందటే మరణించారు. మరి ఆ ముఖం ఆమె తండ్రిదా? లేక... "శరీరంలో ఒత్తిడి స్థాయిలు ప్రమాదకరంగా ఉన్నాయి. రక్తంలో హార్మోన్ల మార్పులు గమనించాను. తక్షణమే జోక్యం చేసుకోవడానికి అనుమతి కోరుతున్నాను." నోవా హెచ్చరించింది. అన్విత తల పైకెత్తింది. ...

**గణిత రూపం - ఉగాది కావ్యం**

**గణిత రూపం - ఉగాది కావ్యం**  


పరాభవ నామ ఉషస్సు మన జీవితంలో ఒక కొత్త సరళ రేఖలా ప్రారంభమవుతుంది
గతాన్ని ఒక చిన్న బిందువుగా వెనక్కి వదిలేస్తుంది.
భవిష్యత్తు వైపు సూటిగా సాగిపోవాలని మనసు పరితపిస్తుంది,

మన ఆశలు ఒక అర్ధరేఖలా అనంతంగా విస్తరిస్తాయి.
ఒకే దిశలో పయనించే మన సంకల్పాలు దిక్సూచిలా దారి చూపుతాయి,

కాల చక్రం భ్రమిస్తూ కోణాల్లా మార్పులను తెస్తుంది.
కొన్ని కోణాలు లఘువుగా (చిన్నవిగా), మరికొన్ని విశాలంగా మారుతాయి,
కానీ ప్రతి కోణం మనకు ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది.

మన కుటుంబం ఒక వృత్తంలా ప్రేమతో మనల్ని చుట్టుకుంటుంది,
ఆ వృత్తానికి ఆది అంతం లేని ఒక అనంత అనుబంధం ఉంటుంది.

మన స్నేహాలు సమాంతర రేఖల్లా ఎప్పటికీ కలవకపోయినా.. తోడుగా నడుస్తాయి,
కొన్ని సంబంధాలు ఛేదన రేఖల్లా ఒక బిందువు వద్ద కలిసి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.

మన భావాలు వక్రరేఖల్లా మలుపులు తిరుగుతుంటాయి,
సంకల్పాలు బహుభుజాల్లా అనేక వైపులా విస్తరిస్తాయి.
అయినా వాటన్నిటి గమ్యం ఒకే లక్ష్య బిందువు వైపు సాగుతుంది,

మన ప్రయత్నం త్రిభుజంలా మూడు మూలలపై స్థిరంగా నిలబడుతుంది.
ఆశ, శ్రమ, విశ్వాసం.. ఈ మూడు సమతుల్యంగా ఉంటేనే విజయం సిద్ధస్తుంది,

జీవితం కొన్నిసార్లు అసమతుల్య ఆకారంలా అనిపించవచ్చు.
కానీ ప్రతి అస్తవ్యస్త చిత్రంలోనూ ఒక గూఢమైన అందం దాగి ఉంటుంది,

మన తప్పులు చెరిపేసిన రేఖల్లా.. సరికొత్తగా మళ్లీ గీయబడతాయి.
కొత్త అవకాశాలు సరికొత్త నిర్మాణాల్లా రూపం దాల్చుతాయి,

మనసు ఒక సమతలంలా విస్తరించి ఎన్నో కలలను పొదుగుకుంటుంది.
మన ప్రయాణం కొలిచే దూరంలా కాకుండా, గాఢమైన అనుభవాలతో నిండిపోవాలి,

ఈ పరాభవ ఉగాది మన జీవితాన్ని సరిచేసే ఒక సుందర రూపంగా మారాలని కోరుకుంటూ.. 🌸

పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో...

...............................................అడ్లూరి మునిందర్ రాజు

(మీ అభిప్రాయాలు Post a Comment లో రాయండి)
 

Comments

Popular posts from this blog

సీ..Real AI ( మొదటి భాగం ) Weekly Serial

అందమైన జీవితం